Wednesday 18 December 2013

అచ్చమైన పాత్రికేయుడికి అవార్డు..





ఇన్నాళ్ళకు తెలుగు యూనివర్సిటి మేల్కొంది.. ఓ నిఖార్సైన నిజమైన జర్నలిస్టును గుర్తించింది.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారికి విశిష్ట పురస్కారం ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకుంది...  జర్నలిజంలో ఓ మిరాకిల్,  ఓ రెవెల్యూషన్ తెచ్చిన సీనియర్ జర్నలిస్టును గుర్తించి తన సిన్సియార్టీని చాటుకుంది.. పాశానికి అవార్డు ప్రకటనతో రాజకీయ అవార్డులకు పుల్ స్టాప్ పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్టసేవలందించిన 11 మంది ప్రముఖులకు శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పుర్కరాలను ప్రకటించింది.. ఈ నెల 27న మధ్యాహ్నం 3.30  నిమిషాలకు హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రధానం జరుగనుంది.. అవార్డు గ్రహితలకు 20, 116 నగదుతోపాటు పురస్కార పత్రం, శాలువతో సత్కరిస్తారు.

Friday 23 August 2013

నందమూరి హరికృష్ణ పప్పీషేమ్..




కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని చెప్పాడట.. ఈ సామెత నందమూరి హరికృష్ణకు సరిగ్గా సరిపోతుంది.. చెప్పేవి శ్రీరంగనీతులు.... వళ్లించేవి అసత్యాలే అన్న సామెత కూడా సీతయ్యకు మ్యాచ్ అవుతుంది...తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని రాజ్యసభలో ఓ... తెగ చొక్కా చించుకుని స్పీచ్ ఇచ్చాడు.. నిండు సభలో నవ్వుల పాలయ్యాడు అది వేరే  విషయం అనుకోండి..  తన సొంతకుటుంబం నందమూరి వంశంలోనే ఐక్యత సాధించలేకపోయాడు... తెలుగు జాతి విడిపోరాదని లెస్స పలికి సొంత కుటుంబంతోనే కలవలేకపోతున్నాడు.. స్వయానా నందమూరి వంశోద్దారకుడు  తమ్ముడు బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వివాహానికి హాజరుకాకపోవడంతో జనాల్లో ఈ చర్చ మొదలైంది..

సమైక్యం సమైక్యం అని గొంతు చించుకున్న హరికృష్ణ తన సొంత కుటుంబంతోనే పొసగలేపోగున్నాడని తీవ్ర విమర్శలు  ఎదుర్కొంటున్నాడు.. వంశాన్నే ఒక్కటి చేయలేనోడు తెలుగు జాతిని ఒక్కటిగా ఉంచమనే హర్హత ఎక్కడిదని తెగ మండిపడుతున్నారు.. కలిసి ఉండాలని మాట్లాడే అర్వత హరికృష్ణకి లేదని నవ్వుకుంటున్నారు.. మొదట నందమూరి ఫ్యామిలిని ఒక్కటి చేసి ఆ తర్వాత తెలుగు జాతి ఒక్కటి గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు.మరి హరికృష్ణ నందమూరి వంశంతో పొసుగుతాడో లేక సమైక్య రాష్ట్రం నినాదాన్ని వదులుతాడో చూడాలి మరి..

రాజ్యసభలో నవ్వులపాలైన హరికృష్ణ స్పీచ్..



Tuesday 6 August 2013

తెలంగాణపై సోనియా ఏమన్నారంటే....

   

 









 

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు నేతలు సోనియాను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. అందుకు ఆమె స్పందిస్తూ... ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. సమస్యలను వినేందుకే తాము ఆంటోని కమిటీని వేసినట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీ ముందు మీ సమస్యలు, అభిప్రాయాలు అన్ని చెప్పాలని ఆమె చెప్పారు. కాగా ఈ సమయంలో కోట్ల విభజన ద్వారా వచ్చే సమస్యలను సోనియా ముందు పెట్టారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ?



పవన్ కళ్యాణ్ అన్న పేరే సన్సేషన్ గా మారింది. హాట్ టాపిక్ అయింది. సీనిమా తీసినా.. పాట పాడినా... కుటుంబ విభేదాలు ఏవైతేనేం.. పవన్  క్రేజీ అంతా ఇంతా కాదు.. కళ్యాణ్ పై కామెంట్ల మీద కామెంట్లు..
ఇక అసలు విషయానికొస్తే... కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలని సన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సూచించారు..తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటేయలేదని పవన్ పార్టీ పెడితే తనకే ఓటేస్తానంటున్నారు..
పవన్  కనుక రాజకీయాల్లోకి వస్తే దున్నేస్తాడని చెబుతున్నాడు.
అంతేనా.. రాజకీయాల్లోకి వచ్చిన హీరోలందరికంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ క్రేజ్ ఉందని ఆకాశానికెత్తేశాడు.. పవన మానియా అంతా ఇంతా కాదని  పాదయాత్ర చేస్తే అది ఓ సంచలనం అవుతుందని వర్మ చెబుతున్నాడు.. ఆ మధ్య పవన్ తెలుగుదేశంలో చేరుతున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. మరి పవర్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి మరి..


కేసీఆర్ హత్యకు కుట్ర ?


టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై హత్యకు కుట్ర... చంద్రశేఖర్ రావును మర్డర్ కు సుపారీ ..  కేసీఆర్ పై హత్యకు కుట్ర జరిగినట్లు సంచలన ప్రకటన చేశారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్... 
 


ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు.. హత్య చేయించేందుకు కుట్ర
పన్నిందెవరో తమకు తెలుసునని మూడు రోజుల క్రితమే పోలీసులకు సమాచారం
అందించామన్నారు.. తమ దగ్గర అన్ని వివరాలున్నాయని  ప్రెస్ మీట్ లో చెప్పారు.. దీంతో
తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
కల్పించాలని టీఆర్ ఎస్ నేతలు సర్కార్ ను డిమాండ్ చేశారు.


Monday 5 August 2013

అత్తారింటికి దారి దొరకని పవన్ కళ్యాణ్ ?


పవన్ కల్యాణ్ అత్తారింటికి దారి దొరకడం లేదు.. అపుడే మీరు ఎక్కడికో వెళ్లిపోకండి మాట్లాడేది పవన్
కొత్త సినిమా అత్తారింటికి దారేది గురించి.. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా
మళ్లీ వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొదటగా ఆగస్టు 5న రిలీజ్ చేయాలని
నిర్ణయించారు. కానీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఆగస్టు 7కు వాయిదా వేశారు. కానీ సమైక్య ఆంధ్ర
ఉద్యమం ఊపందుకోవడంతో సీమాంధ్రలో నిరసన జ్వాలలు రేగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో
సినిమాను రిలీజ్ చేస్తే బాగుండదని భావించిన చిత్ర నిర్మాతలు.. మళ్లీ వాయిదా వేయాలని
చూస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఫ్యామిలీ హోరోస్ సినిమాలను అడ్డుకుంటామని ఇప్పటికే
సీమాంధ్ర జేఏసీ హెచ్చరించింది. దీంతో అంతారింటికి దారేది సినిమాను వాయిదా వేసుకోవడమే
మంచిదని చిత్ర నిర్హాతలు భావిస్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ నెల
19న విడుదల చేసే అవకాశం ఉంది.

Thursday 1 August 2013

అమ్మ చెంతకు అక్క ?







అక్క రాములమ్మ అమ్మ చెంతకు చేరనుంది ? టీఆర్ పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదనతో కుమిలిపోతున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. మెదక్ ఎంపీ సీటు విషయంలో టీఆర్ఆర్ తో విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది.. తెలంగాణ ప్రకటన రోజూ కూడా పార్టీ వర్గాలకు అందుబాటులో లేదు.
అద్వానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో బీజేపీలో చేరుతుందని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో ఆమె సోనియావైపే మొగ్గుచూపుతుంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడుకుందని సమాచారం.. పార్టీ టికెట్ కూడా కన్ఫాం అయినట్లు చెబుతున్నారు. ఇంకేముంది విజయశాంతి మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరనుందన్నమాట.


తెలంగాణ పోరాటం: ఎవరికెన్ని మార్కులు?

1. ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు..
2. ప్రత్యేక వాదంతో పార్టీని నడిపిన కేసీఆర్ ..
3. చదువులను పణంగా పెట్టిన విద్యార్థులు..
4. ఆటా పాటతో ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దర్, కవులు కళాకారులు..
5. ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమం నడిపిన ఉద్యోగ సంఘాలు..
6. అన్ని సంఘాలను ఏకం చేసిన ప్రజాసంఘాలు..







అమరవీరులు




తెలంగాణ ఉద్యమంలో అమర వీరులదే కీలక పాత్ర. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన
త్యాగధనుల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను లెక్కపెట్టని   వారి తర్వాతే ఎవరి పాత్ర అయినా. నిజంగా వీరికి మార్కులు ఇవ్వాల్సి వస్తే అమరులకు సెంట్ పర్సెంట్ ఇవ్వాలి..
మార్కులు 100/100





కేసీఆర్
 తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ ముఖ్య భూమిక పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ క్రెడిట్ చంద్రశేఖర్ రావే కొట్టేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి 12 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ కుయుక్తులను తట్టుకొని చివరకు ప్రత్యేక వాదాన్ని గెలింపించాడు.
అన్ని పార్టీల్లో చలనం తెప్పించాడు. కరుడు గట్టిన సమైక్య వాద పార్టీలతో సైతం  జై తెలంగాణ అన్పించాడు. ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి కేంద్రం చేత ప్రకటన చేయించాడు. వెనక్కి తగ్గిన కేంద్రాన్ని మెడలు వంచి మళ్లీ జై తెలంగాణ
అన్పించాడు. సో  కేసీఆర్  డిస్టింక్షన్ లో పాసయ్యాడు..
మార్కులు : 70/100


విద్యార్థులు:


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విస్మరించలేనిది.. ముఖ్యంగా ఉస్మానియా బిడ్డలు తమ చదువులను పణంగా పెట్టి స్టూడెంట్ పవర్ ఏంటో దేశానికి చాటిచెప్పారు. పోలీసుల లాఠీలకుతూటాలకు బెదరకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పోరాటాలకు ఉస్మానియానే  కేంద్ర బింధువుగా నిల్చింది.
పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెన్ను చూపకుండా పోరాటం సాగించారు. నేతల చేతుల్లో ఉన్న ఉద్యమాన్ని విద్యార్థులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజకీయ నేతలను, పార్టీలను శాసించారు.. తెలంగాణ సాధించారు.
మార్కులు : 50/100



కవులు కళాకారులు :

ఉద్యమానికి ఊపిరీలూదింది కవులూ కళాకారులే. ఆటా పాటలతో జోష్ పెంచారు. కసి రగిలించారు. అవగాహన కల్పించారు. ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు తీయించారు. కవులు, కళాకారులు ఆట పాటలు తెలంగాణ ప్రజల రోమాలు నిక్కపొడిచేలా చేశాయి, మేల్కొలిపాయి. ఆటా పాటా అందరినీ
ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి.
గద్దర్ పాట  "పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా "
పాటే అందుకు ఉదాహరణ.
మార్కులు : 40/100


ఉద్యోగ సంఘాలు :



తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు సైతం తమ వంతు పాత్ర పోషించాయి.. సకల జనుల  సమ్మెతో యావత్ ప్రపంచాన్నే ఆలోచింజేశాయి.. ఏకబిగిన 43 రోజులు అన్నీ బంద్ పెట్టి సర్కార్ ను పూర్తిగా స్తంభింపజేశాయి. జీతాలకు కోతలు పడ్డా భయపడకుండా సర్కార్ బెదిరింపులకు లొంగిపోకుండా  ఉద్యమన్ని ముందుకు తీసుకెళ్లాయి.. అన్ని పార్టీలను ఏకం చేస్తూ నిరంతరం పోరాటంలోనే మునిగితేలారు.
మార్కులు: 30/100



ప్రజా సంఘాలు :
 ప్రత్యేక రాష్ట్ర పోరులో ప్రజా సంఘాలు తమ వంతు కృషి చేశాయి.. ఎంత పెద్ద ఏనుగునైనా గడ్డి పరకతో బందించొచ్చనే సామెతకు ఇదే ఉదాహరణ.. లాయర్లు, కార్మికులు, ఇతర సంఘాలు
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
మార్కులు : 20/100

పీవీ కుమారుడు పీవీ రంగారావు మృతి


 మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు, మాజీ మంత్రి పీవీ రంగారావు మృతించెందారు. ఆగస్టు 1 తెల్లవారు జామున హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో రంగారావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

కొన్ని రోజులుగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి రెండు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

బ్రహ్మచారి అయిన పీవీ రంగారావుకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులున్నారు. రంగారావు మృతితో ఆయన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Friday 14 June 2013

కేసీఆర్ ఫిడేలు వాయిస్తున్నాడా ?



ప్రజల్ని రెచ్చగొట్టడం ఎలానో  ఆయను తెలుసు, వారిని ఎలా వాడుకోవాలో ఇంకా బాగా తెలుసు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాలన్నా.. చప్పున చల్లార్చాలన్నా ఆయనకే సాధ్యం. ఆయనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అయితే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం మాత్రం ఆయనకు తెలియదు.. అపుడెపుడో అమరణదీక్ష తర్వాత పెద్దగా ఎపుడూ పాల్గొన్న పాపాన పోలేదు. గత పన్నెండేళ్లుగా ఇదే తీరు.. అమామక బిడ్డలు, సామాన్యప్రజలు మాత్రం లాటీదెబ్బలు తినాల్సిందే కానీ ఆయన మాత్రం ఫాం హౌస్ కే పరిమితం అవుతుంటాడు. జూన్ 14న నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా అదే జరిగింది. ఓ వైపు ఉస్మానియా బిడ్డలు పోలీసులతో పోట్లాడుతుంటే.. మరోవైపు జేఏసీ నేతలు జగడం పడుతుంటే.. ఇంకో వైపు రాజకీయ నేతలు నానా పాట్లు పడుతుంటే తను మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని టీవీ ఛానెళ్లను చూస్తూ గడిపాడని విమర్శలు విన్పిస్తున్నాయి.. ముట్టడి పేరుతో తెలంగాణ అంతా అట్టుడికి పోతున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇంటికే పరిమితం అయ్యాడు. చివర్లో కొస మెరుపు ఏమంటే అంతా జరిగాక జూన్ 15న బంద్ కు పిలుపునిస్తూ మీడియాకు ఓ స్టేట్ మెంట్ పడేసి తన పనిలో తను నిమగ్నమయ్యాడట. 

Thursday 13 June 2013

ఆస్తి కోసం కుమారుడితో కుమార్తెకు పెళ్లి


సభ్యసమాజం తలదించుకునేలా చేశాడో దుర్మార్ఘుడు.. ప్రపంచ దేశాలు పొగిడే భారతీయ సంస్కతికే మచ్చతెచ్చే ప్రయత్నం చేశాడో కిరాతకతండ్రి.. కన్నకూతురిని సొంత కొడుక్కే ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నించాడు..  కుమార్తెకు వేరే వ్యక్తితో వివాహాం చేస్తే ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందని, కుమార్తెకు కట్నం ఇవ్వాల్సి వస్తుందని, ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొదటి భార్య పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో నిండితుడిని అరెస్టు చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనతో యావత్ సమాజం తలదించుకుంది. దావణగెరెకు చెందిన శివకుఆమర్ తన ఆస్తిని విక్రయించి రెండు నెలల క్రితం అత్తిబెలె సమీపంలోని నెరళూరుకు వచ్చాడు. అక్కడే ఓ ఇంటని అద్దెకు తీసుకున్నాడు. శివకుమార్ మొదటి భార్యకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. రెండో భార్యకు కొడుకు ఉన్నాడు.. రెండో భార్యతో కలిసి పథకం వేశాడు. మొదటి భార్యను దావణగెరెలోనే ఉంచి కుమార్తె, కొడుకు, రెండో భార్యను నెరళూరుకు తీసుకొచ్చాడు. వారిద్దరికి వివాహం చేయడానికి తేదీని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి నింగమ్మ నెరళూరుకు వచ్చి భర్త, అతని రెండో భార్యతో గొడవ పడింది. స్థానికుల
సహాకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Wednesday 12 June 2013

సోనియా అల్లుడు సర్కార్ కూ అల్లుడేనా..?





కొత్త అల్లుడికి అందించే రాచ మర్యాదలు, విదేయతలు రాబర్ట్ వాద్రాకు ప్రభుత్వం అందించాల్సిందేనా..?
అవుననే అన్పిస్తోంది సర్కార్ తీరు చూస్తే.. వాద్రాపై ఈగ కాదు కదా.. కనీసం దోమను కూడా వాలనిచ్చేటట్లు లేదు   కేంద్ర ప్రభుత్వం.. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. వాద్రాకు సంబంధించి వివరాలు అత్యంత రహస్యమని పేర్కొంది. ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని RTI పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు.

సోనియా గాంధీ అల్లుడు వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గతేడాది డీఎల్‌ఎఫ్‌- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు.. నిజంగా సోనియాకు చిత్తశుద్ది ఉంటే తన అల్లుడిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారాణకు ఆదేశించి ఉండేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే తన మాట వినని నేతలు, పార్టీలపై కక్షకట్టి సీబీఐని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు. నిజంగా సోనియా నిజాయితీపరులారైతే తన అల్లుడిపై ఆరోపణలపై సీబీఐ విచారాణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు..

Monday 10 June 2013

అద్వానీ తీరు అద్వాన్నం..

అద్వానీ తీరు అద్వాన్నం..
అద్వానీ తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. కేవలం ప్రధానిపదవి 
ఆశతోనే ఇలా అద్వాన్నంగా  వ్యవహరించాడని వ్యతిరేఖవర్గం తీవ్ర ఆరోపణలు
గుప్పిస్తోంది. అద్వానీ అసలు స్వరూపం ఇపుడు బయటపడిందని పార్టీ కోసం
కాకుండా పదవి కోసమే ఆయన ప్రాముఖ్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇన్నాళ్లూ పార్టీలో  సైలెంట్ గా ఉన్న అద్వానీ ఇపుడే ఎందుకు తన అసంతృప్తిని
వెల్లగక్కగాడని ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాలను ముందుండి ముందుకు తీసుకెళ్తున్న
మోడీపై ఇలా సొంత పార్టీకీ చెందిన అగ్రనేతనే అసంతృప్తి వక్తి చేయడం ద్వార పట్ల ఓ
వర్గం తప్పు పడుతోంది. తనకు ఏవైనా అభిప్రాయ భేదాలుంటే పార్టీలో కూర్చొని
చర్చించుకోవాల్సిందిని, ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం అద్వానీ స్థాయికి
తగినది కాదని మండిపడుతున్నారు. దీని వల్ల ప్రతిపక్షాలకు అవకాశాన్ని
ఇచ్చినట్లైందని వారు  చెబుతున్నారు. అంటే అద్వానీ సొంత పార్టీనే ఇరుకున పెట్టే
ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీకి దేశవ్యాప్తంగా క్రేజ్
పెరుగుతున్న సందర్భంలో అద్వానీ ప్రవర్తన పార్టీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు
సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అధ్వానీ రాజీనామా ఎపిసోడ్ సో శాడ్...



అద్వానీ అస్త్రసన్యాసం..!




బీజేపీలో ముసలం మొదలైంది.. ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. పార్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు..అద్వానీ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కుపంపాడు.. గోవాలో జరిగిన బీజేపీ సదస్సులో నరేంద్ర మోడీకీ ప్రచారబాధ్యతలు
అప్పగించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నాడు.. పార్టీ పదవులకు రాజీనామా చేసి తన అంసతృప్తిని వెల్లగక్కాడు. ఇక నుంచి పార్టీలో  కేవలం సాదారణ కార్యకర్తగానేకొనసాగుతానని స్పష్టం చేశారు. రాజ్ నాథ్ ఇవాళ ఉదయం అద్వానీతో భేటీ అయిన సందర్భంగా కూడా అసంతృప్తిని బలంగానే విన్పించాడాని సమాచారం. ఆర్ ఎస్ ఎస్ కూడా మోడీవైపు మోగ్గచూపడంపై అద్వానీ ఆగ్రహంగా ఊగిపోతున్నాడు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వాదన, అలాగే ఎన్డీఏ పక్షాలు కూడా మోడీని అంగీకరించవని అద్వానీఅభిప్రాయం..
అయితే అద్వానీ ప్రధాని పదవి ఆశతోనే ఇలా చేశాడని మోడీ వర్గం విమర్శిస్తోంది.. పదవులకు రాజీనామా చేసి హుందా తనాన్ని కోల్పోయాడని వ్యతిరేఖ వర్గం విమర్శిస్తోంది.


Friday 7 June 2013

ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూత

సంగీతం మూగబోయింది. జేవీ రాఘవులు ఇక లేరు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూశారు. 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 70 ఏళ్లు. జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, ఎవడబ్బసొమ్ము, నా ఇల్లు నా వాళ్లు, రంగూన్‌ రౌడీ, సంసార బంధం, మొగుడు కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ముక్కుపుడక, 20వ శతాబ్దం, కోతలరాయుడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు తదితర సినిమాలకు జేవీ సంగీతం అందించారు. జేవీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఘంటసాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1970లో విడుదలైన 'ద్రోహి' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 112 సినిమాలకు సంగీతం అందించారు. నేఫధ్య గాయుకుడిగా పాటలు పాడినప్పటికీ ఆయనకు సంగీత దర్శకుడిగానే ఎక్కువ పేరు వచ్చింది. జెవి రాఘవులుగా ప్రసిద్ధుడైన జెట్టి వీరరఘావులు రైతు కుటుంబంలో జన్మించారు. వీరస్వామి నాయుడు, ఆదిలక్ష్మి దంపతులకు ఆయన ఆరో సంతానంగా జన్మించారు. హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించే భద్రాచార్యుల వద్ద అప్పట్లో ఆయన నటనను, గానం అభ్యసించారు. హరిశ్చంద్ర నాటకంలో ఆయన లోహితాస్యుడి పాత్ర ధరించేవారు. పాఠశాల విద్య అభ్యసిస్తూనే నాటకాలు వేయడానికి వివిధ ప్రాంతాలు తిరిగేవారు. ప్రముఖ కవులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ మూర్తి ఆయనకు ఉపాధ్యాయులు. వారు తమ పద్యాలను జెవి రాఘవులుతో పాడిస్తూ ఉండేవారు. ఆయనకు భార్య రమణమ్మ, నలుగురు కుమారులు వేంకటేశ్వరరావు, భాస్కర్, శ్యాం కుమార్, రవి కుమార్, ఓ కూతురు లక్ష్మి ఉన్నారు.


విజయమ్మను ఓదార్చిన సబితా..

విజయమ్మను ఓదార్చిన సబితా..
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.. కోర్టులో ఇద్దరూ పక్కపక్కనే
కూర్చున్నారు.. మరో వైపు జగన్ తల్లి విజయమ్మ కంటనీరు పెట్టుకున్న సందర్భంలో
సబితా ఆమెను ఓదార్చడం జరిగింది.. కేసు విచారణ జరుగుతున్న సమయంలో
జగన్, సబిత అనుచరులు కోర్టులోకి వచ్చి నినాదాలు చేయడంతో కొంత అలజడి
చెలరేగింది. విచారణ 10 నిమిషాలు వాయిదా పడింది. ఇక జగన్ రిమాండ్‌ను నాంపల్లి
సీబీఐ కోర్టు ఈనెల 21 వరకు పొడిగించింది.

Wednesday 5 June 2013

నో బాలీవుడ్.. నో పాలిటిక్స్.. ఓన్లీ టాలీట్రిక్స్..

            
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ ‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చిందని తన నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఇందులో కొత్త లుక్‌తో కనిపిస్తాను అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ కోసం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.

నో బాలీవుడ్... నో పాలిటిక్స్...
         
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో అక్కడి విలేకర్లతో చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ -‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నా నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది.

ఇందులో నేను కొత్త లుక్‌తో కనిపిస్తాను’’ అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.
  

More Headlines

Listings ప్రియమణి తొలి యాక్షన్ మూవీ Listings హైటెక్ కిల్లర్
Listings సరదాగా సాగే నేను చాలా వరస్ట్ Listings అనుష్కతో నాది వండ్రఫుల్ కెమిస్ట్రీ
Listings గ్యాంగ్‌స్టర్‌గా ‘జయం’ రవి Listings ప్రపంచాన్ని కాపాడే సూపర్‌మేన్
Listings నువ్వు లేక నవ్వలేను Listings ‘రాముడు- భీముడు’ చిత్రాన్ని రంగుల్లో చూసుకోవాలని ఉంది
Listings నిశ్శబ్దంగా వెళ్లిపోయిన జియాఖాన్ Listings డైరీలాంటి సినిమా
Listings వంగవీటి మోహనరంగ కథతో చైతన్యరథం-2 తీస్తా... Listings దేహాన్ని అమ్ముకునే వేశ్య, దేశాన్ని అమ్ముకునే రాజకీయ నాయకుడికి మధ్య పోరాటమే ‘పవిత్ర’
Listings అవసరానికీ అత్యాశకీ మధ్య జరిగే పోరాటం Listings ‘సింహా’ కాంబినేషన్ రిపీటైంది
Listings శివాజి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ Listings మనుషులతో జాగ్రత్త
Listings బారిస్టర్ శంకర్‌నారాయణ్ Listings ఆరోజు ఆయన చదివించిన ఆ పుస్తకాలే ఈరోజు నన్ను రచయితను చేశాయి
Listings కావాలని అడిగితేనే అలాంటి డైలాగులు రాశాను Listings ఇంగ్లీషులో రీమేక్ కానున్న తెలుగు సినిమా
2 3
Back to Listing Page
Download e-paper

Sakshi Toolbar

Home | News | Business | Sports | Cinema | Gallery
About Us
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63519&Categoryid=2&subcatid=26#sthash.GNRblTrG.dpuf
నో బాలీవుడ్... నో పాలిటిక్స్...
         
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో అక్కడి విలేకర్లతో చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ -‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నా నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది.

ఇందులో నేను కొత్త లుక్‌తో కనిపిస్తాను’’ అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.

- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63519&Categoryid=2&subcatid=26#sthash.GNRblTrG.dpuf

నో బాలీవుడ్... నో పాలిటిక్స్...
         
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో అక్కడి విలేకర్లతో చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ -‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నా నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది.

ఇందులో నేను కొత్త లుక్‌తో కనిపిస్తాను’’ అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63519&Categoryid=2&subcatid=26#sthash.GNRblTrG.dpuf
నో బాలీవుడ్... నో పాలిటిక్స్...
         
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో అక్కడి విలేకర్లతో చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ -‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నా నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది.

ఇందులో నేను కొత్త లుక్‌తో కనిపిస్తాను’’ అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63519&Categoryid=2&subcatid=26#sthash.GNRblTrG.dpuf