Friday 14 June 2013

కేసీఆర్ ఫిడేలు వాయిస్తున్నాడా ?



ప్రజల్ని రెచ్చగొట్టడం ఎలానో  ఆయను తెలుసు, వారిని ఎలా వాడుకోవాలో ఇంకా బాగా తెలుసు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాలన్నా.. చప్పున చల్లార్చాలన్నా ఆయనకే సాధ్యం. ఆయనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అయితే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం మాత్రం ఆయనకు తెలియదు.. అపుడెపుడో అమరణదీక్ష తర్వాత పెద్దగా ఎపుడూ పాల్గొన్న పాపాన పోలేదు. గత పన్నెండేళ్లుగా ఇదే తీరు.. అమామక బిడ్డలు, సామాన్యప్రజలు మాత్రం లాటీదెబ్బలు తినాల్సిందే కానీ ఆయన మాత్రం ఫాం హౌస్ కే పరిమితం అవుతుంటాడు. జూన్ 14న నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా అదే జరిగింది. ఓ వైపు ఉస్మానియా బిడ్డలు పోలీసులతో పోట్లాడుతుంటే.. మరోవైపు జేఏసీ నేతలు జగడం పడుతుంటే.. ఇంకో వైపు రాజకీయ నేతలు నానా పాట్లు పడుతుంటే తను మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని టీవీ ఛానెళ్లను చూస్తూ గడిపాడని విమర్శలు విన్పిస్తున్నాయి.. ముట్టడి పేరుతో తెలంగాణ అంతా అట్టుడికి పోతున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇంటికే పరిమితం అయ్యాడు. చివర్లో కొస మెరుపు ఏమంటే అంతా జరిగాక జూన్ 15న బంద్ కు పిలుపునిస్తూ మీడియాకు ఓ స్టేట్ మెంట్ పడేసి తన పనిలో తను నిమగ్నమయ్యాడట. 

No comments:

Post a Comment