Wednesday 12 June 2013

సోనియా అల్లుడు సర్కార్ కూ అల్లుడేనా..?





కొత్త అల్లుడికి అందించే రాచ మర్యాదలు, విదేయతలు రాబర్ట్ వాద్రాకు ప్రభుత్వం అందించాల్సిందేనా..?
అవుననే అన్పిస్తోంది సర్కార్ తీరు చూస్తే.. వాద్రాపై ఈగ కాదు కదా.. కనీసం దోమను కూడా వాలనిచ్చేటట్లు లేదు   కేంద్ర ప్రభుత్వం.. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. వాద్రాకు సంబంధించి వివరాలు అత్యంత రహస్యమని పేర్కొంది. ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని RTI పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు.

సోనియా గాంధీ అల్లుడు వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గతేడాది డీఎల్‌ఎఫ్‌- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు.. నిజంగా సోనియాకు చిత్తశుద్ది ఉంటే తన అల్లుడిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారాణకు ఆదేశించి ఉండేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే తన మాట వినని నేతలు, పార్టీలపై కక్షకట్టి సీబీఐని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు. నిజంగా సోనియా నిజాయితీపరులారైతే తన అల్లుడిపై ఆరోపణలపై సీబీఐ విచారాణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు..

No comments:

Post a Comment