Thursday 1 August 2013

తెలంగాణ పోరాటం: ఎవరికెన్ని మార్కులు?

1. ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు..
2. ప్రత్యేక వాదంతో పార్టీని నడిపిన కేసీఆర్ ..
3. చదువులను పణంగా పెట్టిన విద్యార్థులు..
4. ఆటా పాటతో ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దర్, కవులు కళాకారులు..
5. ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమం నడిపిన ఉద్యోగ సంఘాలు..
6. అన్ని సంఘాలను ఏకం చేసిన ప్రజాసంఘాలు..







అమరవీరులు




తెలంగాణ ఉద్యమంలో అమర వీరులదే కీలక పాత్ర. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన
త్యాగధనుల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను లెక్కపెట్టని   వారి తర్వాతే ఎవరి పాత్ర అయినా. నిజంగా వీరికి మార్కులు ఇవ్వాల్సి వస్తే అమరులకు సెంట్ పర్సెంట్ ఇవ్వాలి..
మార్కులు 100/100





కేసీఆర్
 తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ ముఖ్య భూమిక పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ క్రెడిట్ చంద్రశేఖర్ రావే కొట్టేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి 12 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ కుయుక్తులను తట్టుకొని చివరకు ప్రత్యేక వాదాన్ని గెలింపించాడు.
అన్ని పార్టీల్లో చలనం తెప్పించాడు. కరుడు గట్టిన సమైక్య వాద పార్టీలతో సైతం  జై తెలంగాణ అన్పించాడు. ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి కేంద్రం చేత ప్రకటన చేయించాడు. వెనక్కి తగ్గిన కేంద్రాన్ని మెడలు వంచి మళ్లీ జై తెలంగాణ
అన్పించాడు. సో  కేసీఆర్  డిస్టింక్షన్ లో పాసయ్యాడు..
మార్కులు : 70/100


విద్యార్థులు:


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విస్మరించలేనిది.. ముఖ్యంగా ఉస్మానియా బిడ్డలు తమ చదువులను పణంగా పెట్టి స్టూడెంట్ పవర్ ఏంటో దేశానికి చాటిచెప్పారు. పోలీసుల లాఠీలకుతూటాలకు బెదరకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పోరాటాలకు ఉస్మానియానే  కేంద్ర బింధువుగా నిల్చింది.
పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెన్ను చూపకుండా పోరాటం సాగించారు. నేతల చేతుల్లో ఉన్న ఉద్యమాన్ని విద్యార్థులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజకీయ నేతలను, పార్టీలను శాసించారు.. తెలంగాణ సాధించారు.
మార్కులు : 50/100



కవులు కళాకారులు :

ఉద్యమానికి ఊపిరీలూదింది కవులూ కళాకారులే. ఆటా పాటలతో జోష్ పెంచారు. కసి రగిలించారు. అవగాహన కల్పించారు. ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు తీయించారు. కవులు, కళాకారులు ఆట పాటలు తెలంగాణ ప్రజల రోమాలు నిక్కపొడిచేలా చేశాయి, మేల్కొలిపాయి. ఆటా పాటా అందరినీ
ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి.
గద్దర్ పాట  "పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా "
పాటే అందుకు ఉదాహరణ.
మార్కులు : 40/100


ఉద్యోగ సంఘాలు :



తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు సైతం తమ వంతు పాత్ర పోషించాయి.. సకల జనుల  సమ్మెతో యావత్ ప్రపంచాన్నే ఆలోచింజేశాయి.. ఏకబిగిన 43 రోజులు అన్నీ బంద్ పెట్టి సర్కార్ ను పూర్తిగా స్తంభింపజేశాయి. జీతాలకు కోతలు పడ్డా భయపడకుండా సర్కార్ బెదిరింపులకు లొంగిపోకుండా  ఉద్యమన్ని ముందుకు తీసుకెళ్లాయి.. అన్ని పార్టీలను ఏకం చేస్తూ నిరంతరం పోరాటంలోనే మునిగితేలారు.
మార్కులు: 30/100



ప్రజా సంఘాలు :
 ప్రత్యేక రాష్ట్ర పోరులో ప్రజా సంఘాలు తమ వంతు కృషి చేశాయి.. ఎంత పెద్ద ఏనుగునైనా గడ్డి పరకతో బందించొచ్చనే సామెతకు ఇదే ఉదాహరణ.. లాయర్లు, కార్మికులు, ఇతర సంఘాలు
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
మార్కులు : 20/100

4 comments:

  1. 200 marks for late Prof. Jayashankar sir

    ReplyDelete
    Replies
    1. ha exatly.... nobody can forget him... he is the telangana pita..

      Delete
  2. తెలంగాణా కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు
    అలుపెరుగని పోరాటం చేసిన కాళోజీ, కొండా మాధవ రెడ్డి, సర్దార్ అలీ ఖాన్, బుర్రా రాములు, కన్నబిరాన్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి పెద్దలకు శతకోటి వందనాలు
    తొలి దశ పోరాట యోధుడు అన్నబత్తుల రవీంద్రనాథ్ నుండి మలి దశ వీరుడు శ్రీకాంతాచారి వరకు అందరికీ నమస్కారం
    గద్దర్, అందెశ్రీ, గోరేటి, దేశపతి, గూడ అంజన్న, జయరాజ్, విమలక్క, సంధ్య, మధుప్రియ లాంటి కవిగాయక మిత్రులకు క్రుతగ్జ్యతలు
    ప్రొఫెసర్ జయశంకర్ గారి కర్తవ్యబోధనకు నమస్సుమాంజలి
    తెలంగాణా బిడ్డలందరికీ శుభోదయం

    ReplyDelete
    Replies
    1. ప్రొఫెసర్ జయంశంకర్ సారు తెలంగాణ పితా... సార్ ని మర్చిపోలేము... కవులు, కళాకారులు, అమరులకు పేరు పేరునా వందనాలు. ఏవ్వరినీ మర్చిపోలేము ఈ వార్త చూసినందుకు ధన్యావాదాలు

      Delete