Friday 23 August 2013

నందమూరి హరికృష్ణ పప్పీషేమ్..




కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని చెప్పాడట.. ఈ సామెత నందమూరి హరికృష్ణకు సరిగ్గా సరిపోతుంది.. చెప్పేవి శ్రీరంగనీతులు.... వళ్లించేవి అసత్యాలే అన్న సామెత కూడా సీతయ్యకు మ్యాచ్ అవుతుంది...తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని రాజ్యసభలో ఓ... తెగ చొక్కా చించుకుని స్పీచ్ ఇచ్చాడు.. నిండు సభలో నవ్వుల పాలయ్యాడు అది వేరే  విషయం అనుకోండి..  తన సొంతకుటుంబం నందమూరి వంశంలోనే ఐక్యత సాధించలేకపోయాడు... తెలుగు జాతి విడిపోరాదని లెస్స పలికి సొంత కుటుంబంతోనే కలవలేకపోతున్నాడు.. స్వయానా నందమూరి వంశోద్దారకుడు  తమ్ముడు బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వివాహానికి హాజరుకాకపోవడంతో జనాల్లో ఈ చర్చ మొదలైంది..

సమైక్యం సమైక్యం అని గొంతు చించుకున్న హరికృష్ణ తన సొంత కుటుంబంతోనే పొసగలేపోగున్నాడని తీవ్ర విమర్శలు  ఎదుర్కొంటున్నాడు.. వంశాన్నే ఒక్కటి చేయలేనోడు తెలుగు జాతిని ఒక్కటిగా ఉంచమనే హర్హత ఎక్కడిదని తెగ మండిపడుతున్నారు.. కలిసి ఉండాలని మాట్లాడే అర్వత హరికృష్ణకి లేదని నవ్వుకుంటున్నారు.. మొదట నందమూరి ఫ్యామిలిని ఒక్కటి చేసి ఆ తర్వాత తెలుగు జాతి ఒక్కటి గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు.మరి హరికృష్ణ నందమూరి వంశంతో పొసుగుతాడో లేక సమైక్య రాష్ట్రం నినాదాన్ని వదులుతాడో చూడాలి మరి..

రాజ్యసభలో నవ్వులపాలైన హరికృష్ణ స్పీచ్..



Tuesday 6 August 2013

తెలంగాణపై సోనియా ఏమన్నారంటే....

   

 









 

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు నేతలు సోనియాను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. అందుకు ఆమె స్పందిస్తూ... ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. సమస్యలను వినేందుకే తాము ఆంటోని కమిటీని వేసినట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీ ముందు మీ సమస్యలు, అభిప్రాయాలు అన్ని చెప్పాలని ఆమె చెప్పారు. కాగా ఈ సమయంలో కోట్ల విభజన ద్వారా వచ్చే సమస్యలను సోనియా ముందు పెట్టారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ?



పవన్ కళ్యాణ్ అన్న పేరే సన్సేషన్ గా మారింది. హాట్ టాపిక్ అయింది. సీనిమా తీసినా.. పాట పాడినా... కుటుంబ విభేదాలు ఏవైతేనేం.. పవన్  క్రేజీ అంతా ఇంతా కాదు.. కళ్యాణ్ పై కామెంట్ల మీద కామెంట్లు..
ఇక అసలు విషయానికొస్తే... కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలని సన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సూచించారు..తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటేయలేదని పవన్ పార్టీ పెడితే తనకే ఓటేస్తానంటున్నారు..
పవన్  కనుక రాజకీయాల్లోకి వస్తే దున్నేస్తాడని చెబుతున్నాడు.
అంతేనా.. రాజకీయాల్లోకి వచ్చిన హీరోలందరికంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ క్రేజ్ ఉందని ఆకాశానికెత్తేశాడు.. పవన మానియా అంతా ఇంతా కాదని  పాదయాత్ర చేస్తే అది ఓ సంచలనం అవుతుందని వర్మ చెబుతున్నాడు.. ఆ మధ్య పవన్ తెలుగుదేశంలో చేరుతున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. మరి పవర్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి మరి..


కేసీఆర్ హత్యకు కుట్ర ?


టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై హత్యకు కుట్ర... చంద్రశేఖర్ రావును మర్డర్ కు సుపారీ ..  కేసీఆర్ పై హత్యకు కుట్ర జరిగినట్లు సంచలన ప్రకటన చేశారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్... 
 


ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు.. హత్య చేయించేందుకు కుట్ర
పన్నిందెవరో తమకు తెలుసునని మూడు రోజుల క్రితమే పోలీసులకు సమాచారం
అందించామన్నారు.. తమ దగ్గర అన్ని వివరాలున్నాయని  ప్రెస్ మీట్ లో చెప్పారు.. దీంతో
తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
కల్పించాలని టీఆర్ ఎస్ నేతలు సర్కార్ ను డిమాండ్ చేశారు.


Monday 5 August 2013

అత్తారింటికి దారి దొరకని పవన్ కళ్యాణ్ ?


పవన్ కల్యాణ్ అత్తారింటికి దారి దొరకడం లేదు.. అపుడే మీరు ఎక్కడికో వెళ్లిపోకండి మాట్లాడేది పవన్
కొత్త సినిమా అత్తారింటికి దారేది గురించి.. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా
మళ్లీ వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొదటగా ఆగస్టు 5న రిలీజ్ చేయాలని
నిర్ణయించారు. కానీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఆగస్టు 7కు వాయిదా వేశారు. కానీ సమైక్య ఆంధ్ర
ఉద్యమం ఊపందుకోవడంతో సీమాంధ్రలో నిరసన జ్వాలలు రేగుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో
సినిమాను రిలీజ్ చేస్తే బాగుండదని భావించిన చిత్ర నిర్మాతలు.. మళ్లీ వాయిదా వేయాలని
చూస్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి ఫ్యామిలీ హోరోస్ సినిమాలను అడ్డుకుంటామని ఇప్పటికే
సీమాంధ్ర జేఏసీ హెచ్చరించింది. దీంతో అంతారింటికి దారేది సినిమాను వాయిదా వేసుకోవడమే
మంచిదని చిత్ర నిర్హాతలు భావిస్తున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమాను ఈ నెల
19న విడుదల చేసే అవకాశం ఉంది.

Thursday 1 August 2013

అమ్మ చెంతకు అక్క ?







అక్క రాములమ్మ అమ్మ చెంతకు చేరనుంది ? టీఆర్ పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదనతో కుమిలిపోతున్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. మెదక్ ఎంపీ సీటు విషయంలో టీఆర్ఆర్ తో విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది.. తెలంగాణ ప్రకటన రోజూ కూడా పార్టీ వర్గాలకు అందుబాటులో లేదు.
అద్వానీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో బీజేపీలో చేరుతుందని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో ఆమె సోనియావైపే మొగ్గుచూపుతుంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడుకుందని సమాచారం.. పార్టీ టికెట్ కూడా కన్ఫాం అయినట్లు చెబుతున్నారు. ఇంకేముంది విజయశాంతి మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరనుందన్నమాట.


తెలంగాణ పోరాటం: ఎవరికెన్ని మార్కులు?

1. ప్రాణ త్యాగం చేసిన అమరవీరులు..
2. ప్రత్యేక వాదంతో పార్టీని నడిపిన కేసీఆర్ ..
3. చదువులను పణంగా పెట్టిన విద్యార్థులు..
4. ఆటా పాటతో ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దర్, కవులు కళాకారులు..
5. ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమం నడిపిన ఉద్యోగ సంఘాలు..
6. అన్ని సంఘాలను ఏకం చేసిన ప్రజాసంఘాలు..







అమరవీరులు




తెలంగాణ ఉద్యమంలో అమర వీరులదే కీలక పాత్ర. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన
త్యాగధనుల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను లెక్కపెట్టని   వారి తర్వాతే ఎవరి పాత్ర అయినా. నిజంగా వీరికి మార్కులు ఇవ్వాల్సి వస్తే అమరులకు సెంట్ పర్సెంట్ ఇవ్వాలి..
మార్కులు 100/100





కేసీఆర్
 తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ ముఖ్య భూమిక పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ క్రెడిట్ చంద్రశేఖర్ రావే కొట్టేశాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీని స్థాపించి 12 ఏళ్లుగా నడిపిస్తున్నాడు. కాంగ్రెస్ కుయుక్తులను తట్టుకొని చివరకు ప్రత్యేక వాదాన్ని గెలింపించాడు.
అన్ని పార్టీల్లో చలనం తెప్పించాడు. కరుడు గట్టిన సమైక్య వాద పార్టీలతో సైతం  జై తెలంగాణ అన్పించాడు. ప్రాణాలను  సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి కేంద్రం చేత ప్రకటన చేయించాడు. వెనక్కి తగ్గిన కేంద్రాన్ని మెడలు వంచి మళ్లీ జై తెలంగాణ
అన్పించాడు. సో  కేసీఆర్  డిస్టింక్షన్ లో పాసయ్యాడు..
మార్కులు : 70/100


విద్యార్థులు:


ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర విస్మరించలేనిది.. ముఖ్యంగా ఉస్మానియా బిడ్డలు తమ చదువులను పణంగా పెట్టి స్టూడెంట్ పవర్ ఏంటో దేశానికి చాటిచెప్పారు. పోలీసుల లాఠీలకుతూటాలకు బెదరకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. పోరాటాలకు ఉస్మానియానే  కేంద్ర బింధువుగా నిల్చింది.
పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా వెన్ను చూపకుండా పోరాటం సాగించారు. నేతల చేతుల్లో ఉన్న ఉద్యమాన్ని విద్యార్థులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజకీయ నేతలను, పార్టీలను శాసించారు.. తెలంగాణ సాధించారు.
మార్కులు : 50/100



కవులు కళాకారులు :

ఉద్యమానికి ఊపిరీలూదింది కవులూ కళాకారులే. ఆటా పాటలతో జోష్ పెంచారు. కసి రగిలించారు. అవగాహన కల్పించారు. ఉద్యమాన్ని ఉరుకులు పరుగులు తీయించారు. కవులు, కళాకారులు ఆట పాటలు తెలంగాణ ప్రజల రోమాలు నిక్కపొడిచేలా చేశాయి, మేల్కొలిపాయి. ఆటా పాటా అందరినీ
ఆకట్టుకున్నాయి, ఆలోచింపజేశాయి.
గద్దర్ పాట  "పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా "
పాటే అందుకు ఉదాహరణ.
మార్కులు : 40/100


ఉద్యోగ సంఘాలు :



తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు సైతం తమ వంతు పాత్ర పోషించాయి.. సకల జనుల  సమ్మెతో యావత్ ప్రపంచాన్నే ఆలోచింజేశాయి.. ఏకబిగిన 43 రోజులు అన్నీ బంద్ పెట్టి సర్కార్ ను పూర్తిగా స్తంభింపజేశాయి. జీతాలకు కోతలు పడ్డా భయపడకుండా సర్కార్ బెదిరింపులకు లొంగిపోకుండా  ఉద్యమన్ని ముందుకు తీసుకెళ్లాయి.. అన్ని పార్టీలను ఏకం చేస్తూ నిరంతరం పోరాటంలోనే మునిగితేలారు.
మార్కులు: 30/100



ప్రజా సంఘాలు :
 ప్రత్యేక రాష్ట్ర పోరులో ప్రజా సంఘాలు తమ వంతు కృషి చేశాయి.. ఎంత పెద్ద ఏనుగునైనా గడ్డి పరకతో బందించొచ్చనే సామెతకు ఇదే ఉదాహరణ.. లాయర్లు, కార్మికులు, ఇతర సంఘాలు
ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
మార్కులు : 20/100

పీవీ కుమారుడు పీవీ రంగారావు మృతి


 మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమారుడు, మాజీ మంత్రి పీవీ రంగారావు మృతించెందారు. ఆగస్టు 1 తెల్లవారు జామున హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో రంగారావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

కొన్ని రోజులుగా ఆయన గుండెపోటుతో బాధపడుతున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ నుంచి రెండు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

బ్రహ్మచారి అయిన పీవీ రంగారావుకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులున్నారు. రంగారావు మృతితో ఆయన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.