Tuesday 24 June 2014

పాపాయితో లక్ష్మీప్రసన్న...


మంచు లక్ష్మి ఓ సంచలనం!
మంచు లక్ష్మి డేర్ అండ్ డ్యాషింగ్.. 
ఆమె ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్.. 
తను సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడమే అప్పట్లో పెద్ద సెన్సేషన్. అలాగే, చిత్ర నిర్మాణంలో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంది.
ఇప్పుడు తల్లి కావడం కూడా ఓ సంచలనమే.
కారణం, సరోగసీ ద్వారా ఆమె ఓ ఆడబిడ్డకి జన్మనిచ్చింది.
అంటే అద్దెగర్భం ప్రక్రియ ద్వారా బిడ్డని కనడం ఇపుడు మరోసారి సంచలనంగా మారింది.. 
అందుకే, టాలీవుడ్ లో తను చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం లక్ష్మి ఆ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 
ఇక్కడి ఫోటోలో తన బిడ్డని ఒళ్లో పెట్టుకుని సేదతీరుతున్న మంచు వారమ్మాయిని మనం చూడచ్చు.  ఈ ఫోటోను తాజాగా తను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

Wednesday 5 February 2014

మాట్లాడుతూ మౌనదీక్ష !


తింటూ నిరాహార దీక్ష జగన్ పద్దతి.. మాట్లాడుతూ మౌనదీక్ష సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరు.. ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ లో మౌన దీక్షకు దిగారు.. ఫిబ్రవరి 5 బుధవారం మధ్యాహ్నం.. ఇంత వరకు బాగానే ఉంది.. 

కానీ దీక్ష తీరు చూస్తేనే అంతా నవ్వుకుంటున్నారు.. దీక్షను అపహాస్యం చేశాడు.. మౌన దీక్ష అని కూర్చొని వచ్చినా వారందరితో పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు.. రచ్చబండపై కూర్చున్నట్లు కూర్చొని దీక్షనే హేలన చేశాడు.. సీఎం గారు నోరు మూతబడితే ఒట్టు, ఆయన మాట్లాడడం చూసి, సీమాంధ్ర ప్రజలకు నోట మాట రాక, ముక్కున వేలేసుకొని మూర్చపోయే అంత పనైంది ..  సీఎంకు సమైక్యాంధ్రపై ఎంత చిత్తశుద్ది ఉందో ఈ దీక్షచూసైనే అర్థం అవుతుందని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తున్నారు..

Wednesday 18 December 2013

అచ్చమైన పాత్రికేయుడికి అవార్డు..





ఇన్నాళ్ళకు తెలుగు యూనివర్సిటి మేల్కొంది.. ఓ నిఖార్సైన నిజమైన జర్నలిస్టును గుర్తించింది.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారికి విశిష్ట పురస్కారం ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకుంది...  జర్నలిజంలో ఓ మిరాకిల్,  ఓ రెవెల్యూషన్ తెచ్చిన సీనియర్ జర్నలిస్టును గుర్తించి తన సిన్సియార్టీని చాటుకుంది.. పాశానికి అవార్డు ప్రకటనతో రాజకీయ అవార్డులకు పుల్ స్టాప్ పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్టసేవలందించిన 11 మంది ప్రముఖులకు శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పుర్కరాలను ప్రకటించింది.. ఈ నెల 27న మధ్యాహ్నం 3.30  నిమిషాలకు హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రధానం జరుగనుంది.. అవార్డు గ్రహితలకు 20, 116 నగదుతోపాటు పురస్కార పత్రం, శాలువతో సత్కరిస్తారు.

Friday 23 August 2013

నందమూరి హరికృష్ణ పప్పీషేమ్..




కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానని చెప్పాడట.. ఈ సామెత నందమూరి హరికృష్ణకు సరిగ్గా సరిపోతుంది.. చెప్పేవి శ్రీరంగనీతులు.... వళ్లించేవి అసత్యాలే అన్న సామెత కూడా సీతయ్యకు మ్యాచ్ అవుతుంది...తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని రాజ్యసభలో ఓ... తెగ చొక్కా చించుకుని స్పీచ్ ఇచ్చాడు.. నిండు సభలో నవ్వుల పాలయ్యాడు అది వేరే  విషయం అనుకోండి..  తన సొంతకుటుంబం నందమూరి వంశంలోనే ఐక్యత సాధించలేకపోయాడు... తెలుగు జాతి విడిపోరాదని లెస్స పలికి సొంత కుటుంబంతోనే కలవలేకపోతున్నాడు.. స్వయానా నందమూరి వంశోద్దారకుడు  తమ్ముడు బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని వివాహానికి హాజరుకాకపోవడంతో జనాల్లో ఈ చర్చ మొదలైంది..

సమైక్యం సమైక్యం అని గొంతు చించుకున్న హరికృష్ణ తన సొంత కుటుంబంతోనే పొసగలేపోగున్నాడని తీవ్ర విమర్శలు  ఎదుర్కొంటున్నాడు.. వంశాన్నే ఒక్కటి చేయలేనోడు తెలుగు జాతిని ఒక్కటిగా ఉంచమనే హర్హత ఎక్కడిదని తెగ మండిపడుతున్నారు.. కలిసి ఉండాలని మాట్లాడే అర్వత హరికృష్ణకి లేదని నవ్వుకుంటున్నారు.. మొదట నందమూరి ఫ్యామిలిని ఒక్కటి చేసి ఆ తర్వాత తెలుగు జాతి ఒక్కటి గురించి మాట్లాడాలని సూచిస్తున్నారు.మరి హరికృష్ణ నందమూరి వంశంతో పొసుగుతాడో లేక సమైక్య రాష్ట్రం నినాదాన్ని వదులుతాడో చూడాలి మరి..

రాజ్యసభలో నవ్వులపాలైన హరికృష్ణ స్పీచ్..



Tuesday 6 August 2013

తెలంగాణపై సోనియా ఏమన్నారంటే....

   

 









 

తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ మరోసారి తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు నేతలు సోనియాను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. అందుకు ఆమె స్పందిస్తూ... ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. మీ ప్రాంత సమస్యలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు వచ్చే ప్రతి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని ఆమె సూచించారు. సమస్యలను వినేందుకే తాము ఆంటోని కమిటీని వేసినట్లు చెప్పారు. ఆంటోనీ కమిటీ ముందు మీ సమస్యలు, అభిప్రాయాలు అన్ని చెప్పాలని ఆమె చెప్పారు. కాగా ఈ సమయంలో కోట్ల విభజన ద్వారా వచ్చే సమస్యలను సోనియా ముందు పెట్టారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ?



పవన్ కళ్యాణ్ అన్న పేరే సన్సేషన్ గా మారింది. హాట్ టాపిక్ అయింది. సీనిమా తీసినా.. పాట పాడినా... కుటుంబ విభేదాలు ఏవైతేనేం.. పవన్  క్రేజీ అంతా ఇంతా కాదు.. కళ్యాణ్ పై కామెంట్ల మీద కామెంట్లు..
ఇక అసలు విషయానికొస్తే... కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలని సన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సూచించారు..తన జీవితంలో ఒక్కసారి కూడా ఓటేయలేదని పవన్ పార్టీ పెడితే తనకే ఓటేస్తానంటున్నారు..
పవన్  కనుక రాజకీయాల్లోకి వస్తే దున్నేస్తాడని చెబుతున్నాడు.
అంతేనా.. రాజకీయాల్లోకి వచ్చిన హీరోలందరికంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ క్రేజ్ ఉందని ఆకాశానికెత్తేశాడు.. పవన మానియా అంతా ఇంతా కాదని  పాదయాత్ర చేస్తే అది ఓ సంచలనం అవుతుందని వర్మ చెబుతున్నాడు.. ఆ మధ్య పవన్ తెలుగుదేశంలో చేరుతున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. మరి పవర్ స్టార్ ఏం చేస్తాడో చూడాలి మరి..


కేసీఆర్ హత్యకు కుట్ర ?


టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై హత్యకు కుట్ర... చంద్రశేఖర్ రావును మర్డర్ కు సుపారీ ..  కేసీఆర్ పై హత్యకు కుట్ర జరిగినట్లు సంచలన ప్రకటన చేశారు ఆ పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్... 
 


ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు.. హత్య చేయించేందుకు కుట్ర
పన్నిందెవరో తమకు తెలుసునని మూడు రోజుల క్రితమే పోలీసులకు సమాచారం
అందించామన్నారు.. తమ దగ్గర అన్ని వివరాలున్నాయని  ప్రెస్ మీట్ లో చెప్పారు.. దీంతో
తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ
కల్పించాలని టీఆర్ ఎస్ నేతలు సర్కార్ ను డిమాండ్ చేశారు.