Wednesday 18 December 2013

అచ్చమైన పాత్రికేయుడికి అవార్డు..





ఇన్నాళ్ళకు తెలుగు యూనివర్సిటి మేల్కొంది.. ఓ నిఖార్సైన నిజమైన జర్నలిస్టును గుర్తించింది.. పాత్రికేయ వృత్తికే వన్నె తెచ్చిన సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారికి విశిష్ట పురస్కారం ప్రకటించి తన నిజాయితీని నిరూపించుకుంది...  జర్నలిజంలో ఓ మిరాకిల్,  ఓ రెవెల్యూషన్ తెచ్చిన సీనియర్ జర్నలిస్టును గుర్తించి తన సిన్సియార్టీని చాటుకుంది.. పాశానికి అవార్డు ప్రకటనతో రాజకీయ అవార్డులకు పుల్ స్టాప్ పడ్డట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

తెలుగు భాషా సాహిత్యం, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్టసేవలందించిన 11 మంది ప్రముఖులకు శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పుర్కరాలను ప్రకటించింది.. ఈ నెల 27న మధ్యాహ్నం 3.30  నిమిషాలకు హైదరాబాద్ వర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రధానం జరుగనుంది.. అవార్డు గ్రహితలకు 20, 116 నగదుతోపాటు పురస్కార పత్రం, శాలువతో సత్కరిస్తారు.