Monday 10 June 2013

అద్వానీ అస్త్రసన్యాసం..!




బీజేపీలో ముసలం మొదలైంది.. ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. పార్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు..అద్వానీ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కుపంపాడు.. గోవాలో జరిగిన బీజేపీ సదస్సులో నరేంద్ర మోడీకీ ప్రచారబాధ్యతలు
అప్పగించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నాడు.. పార్టీ పదవులకు రాజీనామా చేసి తన అంసతృప్తిని వెల్లగక్కాడు. ఇక నుంచి పార్టీలో  కేవలం సాదారణ కార్యకర్తగానేకొనసాగుతానని స్పష్టం చేశారు. రాజ్ నాథ్ ఇవాళ ఉదయం అద్వానీతో భేటీ అయిన సందర్భంగా కూడా అసంతృప్తిని బలంగానే విన్పించాడాని సమాచారం. ఆర్ ఎస్ ఎస్ కూడా మోడీవైపు మోగ్గచూపడంపై అద్వానీ ఆగ్రహంగా ఊగిపోతున్నాడు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వాదన, అలాగే ఎన్డీఏ పక్షాలు కూడా మోడీని అంగీకరించవని అద్వానీఅభిప్రాయం..
అయితే అద్వానీ ప్రధాని పదవి ఆశతోనే ఇలా చేశాడని మోడీ వర్గం విమర్శిస్తోంది.. పదవులకు రాజీనామా చేసి హుందా తనాన్ని కోల్పోయాడని వ్యతిరేఖ వర్గం విమర్శిస్తోంది.


No comments:

Post a Comment