Wednesday 5 June 2013

నాన్ వెజ్ తో వెజిటబుల్స్ పోటీ...

కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వాతావరణ చల్లబడినా రేట్లు మాత్రం భగభగమండుతూనే ఉన్నాయి. 15 రోజుల వ్యవధిలోనే టమాటా ధర మూడు రెట్లు పెరగ్గా.. బీన్స్ ధరలు బాబోయ్ అనిపిస్తున్నాయి. మొన్నటివరకూ 10-12 రూపాయల మధ్య ఉన్న కిలో టమాటా ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. బీన్స్ 20 నుంచి 90కి  పెరిగింది. కాలనీల్లోని దుకాణాల్లో అయితే కిలో వంద రూపాయలకు అమ్ముతున్నారు. అటు పచ్చిమిర్చి ఘాటెక్కింది. రైతు బజారులో కిలో 60కి విక్రయిస్తుంటే బయట మాత్రం అంతకన్నా బాగా ఎక్కువకు అమ్ముతున్నారు. ఈమధ్య వరకూ కిలో 20 రూపాయలున్న చిక్కుడు 70కి చేరింది. నెల క్రితం 20కి దొరికిన క్యారట్ ఇప్పుడు 50 ఇస్తేగానీ రానంటోంది. సాగు తగ్గడం, దిగుబడి పడిపోవడంవల్లే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని రైతు బజారులో సరుకులు విక్రయించే రైతులు, బయట వ్యాపారులు చెబుతున్నారు. పచ్చడి, పప్పులో వాడే చింత చిగురు కూడా కిలో 200 రూపాయలు పలుకుతోంది.

కూరగాయలు వండకముందే ఉడికిపోతున్నాయి. ధరలు మండిపోతున్నాయి. టమాటా రేటు చుక్కలు చూపిస్తుంటే బీన్స్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. పచ్చిచమిర్చి ఘాటెక్కగా.. బెండ, దొండ ధరలు దూసుకుపోతున్నాయి.

సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొన్ని కూరగాయాలకు దూరంగా వుండాల్సిన పరిస్థితి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మెంతికూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర తదితర వ్యాపారులు ఎంతో జాగ్రత్తగా గోనె సంచుల్లో విక్రయాలు సాగిస్తున్నారు.

No comments:

Post a Comment