ప్రజల్ని రెచ్చగొట్టడం ఎలానో ఆయను తెలుసు, వారిని ఎలా వాడుకోవాలో ఇంకా బాగా తెలుసు, ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపాలన్నా.. చప్పున చల్లార్చాలన్నా ఆయనకే సాధ్యం. ఆయనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అయితే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం మాత్రం ఆయనకు తెలియదు.. అపుడెపుడో అమరణదీక్ష తర్వాత పెద్దగా ఎపుడూ పాల్గొన్న పాపాన పోలేదు. గత పన్నెండేళ్లుగా ఇదే తీరు.. అమామక బిడ్డలు, సామాన్యప్రజలు మాత్రం లాటీదెబ్బలు తినాల్సిందే కానీ ఆయన మాత్రం ఫాం హౌస్ కే పరిమితం అవుతుంటాడు. జూన్ 14న నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో కూడా అదే జరిగింది. ఓ వైపు ఉస్మానియా బిడ్డలు పోలీసులతో పోట్లాడుతుంటే.. మరోవైపు జేఏసీ నేతలు జగడం పడుతుంటే.. ఇంకో వైపు రాజకీయ నేతలు నానా పాట్లు పడుతుంటే తను మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని టీవీ ఛానెళ్లను చూస్తూ గడిపాడని విమర్శలు విన్పిస్తున్నాయి.. ముట్టడి పేరుతో తెలంగాణ అంతా అట్టుడికి పోతున్నా కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఇంటికే పరిమితం అయ్యాడు. చివర్లో కొస మెరుపు ఏమంటే అంతా జరిగాక జూన్ 15న బంద్ కు పిలుపునిస్తూ మీడియాకు ఓ స్టేట్ మెంట్ పడేసి తన పనిలో తను నిమగ్నమయ్యాడట.
Friday, 14 June 2013
కేసీఆర్ ఫిడేలు వాయిస్తున్నాడా ?

Thursday, 13 June 2013
ఆస్తి కోసం కుమారుడితో కుమార్తెకు పెళ్లి
సభ్యసమాజం తలదించుకునేలా చేశాడో దుర్మార్ఘుడు.. ప్రపంచ దేశాలు పొగిడే భారతీయ సంస్కతికే మచ్చతెచ్చే ప్రయత్నం చేశాడో కిరాతకతండ్రి.. కన్నకూతురిని సొంత కొడుక్కే ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నించాడు.. కుమార్తెకు వేరే వ్యక్తితో వివాహాం చేస్తే ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందని, కుమార్తెకు కట్నం ఇవ్వాల్సి వస్తుందని, ఈ దారుణానికి పాల్పడ్డాడు. మొదటి భార్య పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో నిండితుడిని అరెస్టు చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనతో యావత్ సమాజం తలదించుకుంది. దావణగెరెకు చెందిన శివకుఆమర్ తన ఆస్తిని విక్రయించి రెండు నెలల క్రితం అత్తిబెలె సమీపంలోని నెరళూరుకు వచ్చాడు. అక్కడే ఓ ఇంటని అద్దెకు తీసుకున్నాడు. శివకుమార్ మొదటి భార్యకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. రెండో భార్యకు కొడుకు ఉన్నాడు.. రెండో భార్యతో కలిసి పథకం వేశాడు. మొదటి భార్యను దావణగెరెలోనే ఉంచి కుమార్తె, కొడుకు, రెండో భార్యను నెరళూరుకు తీసుకొచ్చాడు. వారిద్దరికి వివాహం చేయడానికి తేదీని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లి నింగమ్మ నెరళూరుకు వచ్చి భర్త, అతని రెండో భార్యతో గొడవ పడింది. స్థానికుల
సహాకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Wednesday, 12 June 2013
సోనియా అల్లుడు సర్కార్ కూ అల్లుడేనా..?
కొత్త అల్లుడికి అందించే రాచ మర్యాదలు, విదేయతలు రాబర్ట్ వాద్రాకు ప్రభుత్వం అందించాల్సిందేనా..?
అవుననే అన్పిస్తోంది సర్కార్ తీరు చూస్తే.. వాద్రాపై ఈగ కాదు కదా.. కనీసం దోమను కూడా వాలనిచ్చేటట్లు లేదు కేంద్ర ప్రభుత్వం.. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించింది. వాద్రాకు సంబంధించి వివరాలు అత్యంత రహస్యమని పేర్కొంది. ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని RTI పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై వివరాలు కావాలంటూ అడిగితే, ఇది న్యాయస్థానం పరిధిలోని అంశం అని సమాచారం ఇవ్వకుండా పీఎంఓ అధికారులు తప్పించుకున్నారు.
సోనియా గాంధీ అల్లుడు వాద్రాకు పలు వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆయన ఉచితంగా భూములను పొందారు. గతేడాది డీఎల్‌ఎఫ్- వాద్రాల మధ్య భూ అక్రమాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు.. నిజంగా సోనియాకు చిత్తశుద్ది ఉంటే తన అల్లుడిపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారాణకు ఆదేశించి ఉండేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అదే తన మాట వినని నేతలు, పార్టీలపై కక్షకట్టి సీబీఐని ఉసిగొల్పుతుందని ఆరోపిస్తున్నారు. నిజంగా సోనియా నిజాయితీపరులారైతే తన అల్లుడిపై ఆరోపణలపై సీబీఐ విచారాణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు..
Monday, 10 June 2013
అద్వానీ తీరు అద్వాన్నం..
అద్వానీ తీరు అద్వాన్నం..
అద్వానీ తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు విన్పిస్తున్నాయి. కేవలం ప్రధానిపదవి
ఆశతోనే ఇలా అద్వాన్నంగా వ్యవహరించాడని వ్యతిరేఖవర్గం తీవ్ర ఆరోపణలు
గుప్పిస్తోంది. అద్వానీ అసలు స్వరూపం ఇపుడు బయటపడిందని పార్టీ కోసం
కాకుండా పదవి కోసమే ఆయన ప్రాముఖ్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
ఇన్నాళ్లూ పార్టీలో సైలెంట్ గా ఉన్న అద్వానీ ఇపుడే ఎందుకు తన అసంతృప్తిని
వెల్లగక్కగాడని ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాలను ముందుండి ముందుకు తీసుకెళ్తున్న
మోడీపై ఇలా సొంత పార్టీకీ చెందిన అగ్రనేతనే అసంతృప్తి వక్తి చేయడం ద్వార పట్ల ఓ
వర్గం తప్పు పడుతోంది. తనకు ఏవైనా అభిప్రాయ భేదాలుంటే పార్టీలో కూర్చొని
చర్చించుకోవాల్సిందిని, ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం అద్వానీ స్థాయికి
తగినది కాదని మండిపడుతున్నారు. దీని వల్ల ప్రతిపక్షాలకు అవకాశాన్ని
ఇచ్చినట్లైందని వారు చెబుతున్నారు. అంటే అద్వానీ సొంత పార్టీనే ఇరుకున పెట్టే
ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీకి దేశవ్యాప్తంగా క్రేజ్
పెరుగుతున్న సందర్భంలో అద్వానీ ప్రవర్తన పార్టీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు
సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా అధ్వానీ రాజీనామా ఎపిసోడ్ సో శాడ్...

అద్వానీ అస్త్రసన్యాసం..!
బీజేపీలో ముసలం మొదలైంది.. ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. పార్టీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు..అద్వానీ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కుపంపాడు.. గోవాలో జరిగిన బీజేపీ సదస్సులో నరేంద్ర మోడీకీ ప్రచారబాధ్యతలు
అప్పగించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నాడు.. పార్టీ పదవులకు రాజీనామా చేసి తన అంసతృప్తిని వెల్లగక్కాడు. ఇక నుంచి పార్టీలో కేవలం సాదారణ కార్యకర్తగానేకొనసాగుతానని స్పష్టం చేశారు. రాజ్ నాథ్ ఇవాళ ఉదయం అద్వానీతో భేటీ అయిన సందర్భంగా కూడా అసంతృప్తిని బలంగానే విన్పించాడాని సమాచారం. ఆర్ ఎస్ ఎస్ కూడా మోడీవైపు మోగ్గచూపడంపై అద్వానీ ఆగ్రహంగా ఊగిపోతున్నాడు. మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వాదన, అలాగే ఎన్డీఏ పక్షాలు కూడా మోడీని అంగీకరించవని అద్వానీఅభిప్రాయం..
అయితే అద్వానీ ప్రధాని పదవి ఆశతోనే ఇలా చేశాడని మోడీ వర్గం విమర్శిస్తోంది.. పదవులకు రాజీనామా చేసి హుందా తనాన్ని కోల్పోయాడని వ్యతిరేఖ వర్గం విమర్శిస్తోంది.
Friday, 7 June 2013
ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూత
సంగీతం మూగబోయింది. జేవీ రాఘవులు ఇక లేరు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జేవీ రాఘవులు కన్నుమూశారు. 2 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 70 ఏళ్లు. జీవన తరంగాలు, కటకటాల రుద్రయ్య, ఎవడబ్బసొమ్ము, నా ఇల్లు నా వాళ్లు, రంగూన్ రౌడీ, సంసార బంధం, మొగుడు కావాలి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ముక్కుపుడక, 20వ శతాబ్దం, కోతలరాయుడు, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు తదితర సినిమాలకు జేవీ సంగీతం అందించారు. జేవీ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఘంటసాల వద్ద సహాయకుడిగా పనిచేశారు. 1970లో విడుదలైన 'ద్రోహి' చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 112 సినిమాలకు సంగీతం అందించారు. నేఫధ్య గాయుకుడిగా పాటలు పాడినప్పటికీ ఆయనకు సంగీత దర్శకుడిగానే ఎక్కువ పేరు వచ్చింది. జెవి రాఘవులుగా ప్రసిద్ధుడైన జెట్టి వీరరఘావులు రైతు కుటుంబంలో జన్మించారు. వీరస్వామి నాయుడు, ఆదిలక్ష్మి దంపతులకు ఆయన ఆరో సంతానంగా జన్మించారు. హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించే భద్రాచార్యుల వద్ద అప్పట్లో ఆయన నటనను, గానం అభ్యసించారు. హరిశ్చంద్ర నాటకంలో ఆయన లోహితాస్యుడి పాత్ర ధరించేవారు. పాఠశాల విద్య అభ్యసిస్తూనే నాటకాలు వేయడానికి వివిధ ప్రాంతాలు తిరిగేవారు. ప్రముఖ కవులు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వేదుల సత్యనారాయణ మూర్తి ఆయనకు ఉపాధ్యాయులు. వారు తమ పద్యాలను జెవి రాఘవులుతో పాడిస్తూ ఉండేవారు. ఆయనకు భార్య రమణమ్మ, నలుగురు కుమారులు వేంకటేశ్వరరావు, భాస్కర్, శ్యాం కుమార్, రవి కుమార్, ఓ కూతురు లక్ష్మి ఉన్నారు.
విజయమ్మను ఓదార్చిన సబితా..
విజయమ్మను ఓదార్చిన సబితా..
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.. కోర్టులో ఇద్దరూ పక్కపక్కనే
కూర్చున్నారు.. మరో వైపు జగన్ తల్లి విజయమ్మ కంటనీరు పెట్టుకున్న సందర్భంలో
సబితా ఆమెను ఓదార్చడం జరిగింది.. కేసు విచారణ జరుగుతున్న సమయంలో
జగన్, సబిత అనుచరులు కోర్టులోకి వచ్చి నినాదాలు చేయడంతో కొంత అలజడి
చెలరేగింది. విచారణ 10 నిమిషాలు వాయిదా పడింది. ఇక జగన్ రిమాండ్‌ను నాంపల్లి
సీబీఐ కోర్టు ఈనెల 21 వరకు పొడిగించింది.

Wednesday, 5 June 2013
నో బాలీవుడ్.. నో పాలిటిక్స్.. ఓన్లీ టాలీట్రిక్స్..
మహేష్‌బాబు త్వరలో హిందీ సినిమా చేయబోతున్నారనే వార్త ఈమధ్య మీడియాలో బాగా హల్‌చల్ చేసింది. అయితే మహేష్‌కి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదట. మరో పదేళ్ల వరకూ టాలీవుడ్‌ని వదిలి వేరే చోటుకి వెళ్లే ఆలోచన లేదని బుధవారం విజయవాడలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ చెప్పారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ ‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చిందని తన నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఇందులో కొత్త లుక్‌తో కనిపిస్తాను అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ కోసం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం.
నో బాలీవుడ్... నో పాలిటిక్స్...
![]() రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని మహేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘1’ చిత్రం గురించి మహేష్ చెబుతూ -‘‘ఇటీవలే టీజర్ విడుదల చేస్తే, ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నా నటజీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుంది. ఇందులో నేను కొత్త లుక్‌తో కనిపిస్తాను’’ అన్నారు. వచ్చేవారం ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం మహేష్ లండన్ వెళ్లబోతున్నారు. అక్కడ దాదాపు నెల రోజులపాటు భారీ షెడ్యూలు జరగనుంది. ‘1’ శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ చానెల్ భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిందని, ఇప్పటివరకూ తెలుగులో ఇదే అత్యధిక మొత్తం అని ఫిలిమ్‌నగర్ వర్గాల సమాచారం. |
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63519&Categoryid=2&subcatid=26#sthash.GNRblTrG.dpuf

నాన్ వెజ్ తో వెజిటబుల్స్ పోటీ...
కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వాతావరణ చల్లబడినా రేట్లు మాత్రం భగభగమండుతూనే ఉన్నాయి. 15 రోజుల వ్యవధిలోనే టమాటా ధర మూడు రెట్లు పెరగ్గా.. బీన్స్ ధరలు బాబోయ్ అనిపిస్తున్నాయి. మొన్నటివరకూ 10-12 రూపాయల మధ్య ఉన్న కిలో టమాటా ఇప్పుడు 80 రూపాయలకు చేరింది. బీన్స్ 20 నుంచి 90కి పెరిగింది. కాలనీల్లోని దుకాణాల్లో అయితే కిలో వంద రూపాయలకు అమ్ముతున్నారు. అటు పచ్చిమిర్చి ఘాటెక్కింది. రైతు బజారులో కిలో 60కి విక్రయిస్తుంటే బయట మాత్రం అంతకన్నా బాగా ఎక్కువకు అమ్ముతున్నారు. ఈమధ్య వరకూ కిలో 20 రూపాయలున్న చిక్కుడు 70కి చేరింది. నెల క్రితం 20కి దొరికిన క్యారట్ ఇప్పుడు 50 ఇస్తేగానీ రానంటోంది. సాగు తగ్గడం, దిగుబడి పడిపోవడంవల్లే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని రైతు బజారులో సరుకులు విక్రయించే రైతులు, బయట వ్యాపారులు చెబుతున్నారు. పచ్చడి, పప్పులో వాడే చింత చిగురు కూడా కిలో 200 రూపాయలు పలుకుతోంది.
కూరగాయలు వండకముందే ఉడికిపోతున్నాయి. ధరలు మండిపోతున్నాయి. టమాటా రేటు చుక్కలు చూపిస్తుంటే బీన్స్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసింది. పచ్చిచమిర్చి ఘాటెక్కగా.. బెండ, దొండ ధరలు దూసుకుపోతున్నాయి.
సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొన్ని కూరగాయాలకు దూరంగా వుండాల్సిన పరిస్థితి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మెంతికూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర తదితర వ్యాపారులు ఎంతో జాగ్రత్తగా గోనె సంచుల్లో విక్రయాలు సాగిస్తున్నారు.

Subscribe to:
Posts (Atom)