Wednesday 5 February 2014

మాట్లాడుతూ మౌనదీక్ష !


తింటూ నిరాహార దీక్ష జగన్ పద్దతి.. మాట్లాడుతూ మౌనదీక్ష సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరు.. ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ లో మౌన దీక్షకు దిగారు.. ఫిబ్రవరి 5 బుధవారం మధ్యాహ్నం.. ఇంత వరకు బాగానే ఉంది.. 

కానీ దీక్ష తీరు చూస్తేనే అంతా నవ్వుకుంటున్నారు.. దీక్షను అపహాస్యం చేశాడు.. మౌన దీక్ష అని కూర్చొని వచ్చినా వారందరితో పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు.. రచ్చబండపై కూర్చున్నట్లు కూర్చొని దీక్షనే హేలన చేశాడు.. సీఎం గారు నోరు మూతబడితే ఒట్టు, ఆయన మాట్లాడడం చూసి, సీమాంధ్ర ప్రజలకు నోట మాట రాక, ముక్కున వేలేసుకొని మూర్చపోయే అంత పనైంది ..  సీఎంకు సమైక్యాంధ్రపై ఎంత చిత్తశుద్ది ఉందో ఈ దీక్షచూసైనే అర్థం అవుతుందని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తున్నారు..

3 comments:

  1. కచరా గారు సెలైను బాటిళ్ళు యెక్కించుకుంటూ చేసిన అత్యంత విలాసవంతమయిన నిరాహార దీక్ష సంగతేమిటి?అది గిట్టుబాటయిందిగా..దానికి నవ్వినవాళ్ళూ ఉన్నారప్పుడు. ఉదర పోషణార్ధం అన్నట్టు ప్రతిష్ట రక్షణార్ధం, అంతే.

    ReplyDelete
  2. 4 hours fast, a long record indeed!

    ReplyDelete
  3. కికురెవి చిల్లర వేషాలయితే అగ్గి పుల్ల తీసుకెళ్ళకుండా ఆత్మాహుతికి తెగబడ్డం యేమవుతుందో?

    ReplyDelete